సినీ నటుడు రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ ఇస్తున్నడాక్టర్లు

సినీ నటుడు రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ ఇస్తున్నడాక్టర్లు

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్  ఆస్పత్రిలో కరోనా చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో సిటీ న్యూరో సెంటర్ వర్గాలు హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశాయి. రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.  ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామన్నారు. రాజశేఖర్ ను తమ డాక్టర్ల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు.