Ramayana: రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్తో ‘రామాయణ’.. హనుమంతుడి పాత్రలో గర్జించేది నేనే..

Ramayana: రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్తో ‘రామాయణ’.. హనుమంతుడి పాత్రలో గర్జించేది నేనే..

నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘రామాయణ’ (Ramayana). రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై సర్వతా ఆసక్తి నెలకొంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్ర ఆబాల గోపాలాన్ని కట్టిపడేస్తుంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీదేవోల్ కనిపించనున్నారు. లేటెస్ట్గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాయణ అప్డేట్ ఇచ్చాడు. 

హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా ఉందని, చాలా ఉత్సాహంతో పాటు సరదాగానూ సాగుతుందని చెప్పుకొచ్చారు. తన పాత్ర చిత్రీకరణ ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాపై తనకు ఎంత ఆసక్తి ఉందో అంతే భయం కూడా ఉందంటున్నారు.

►ALSO READ | Nagarjuna: స్టైలిష్ విలన్గా అదరగొట్టిన నాగార్జున.. కూలీ బ్లాక్ బస్టర్పై కింగ్ ఏమన్నారంటే?

ఎందుకంటే, ఇలాంటి పాత్రలు సవాలుగా ఉంటాయని, అందులో జీవించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతి పంచేందుకు చిత్ర బృందమంతా నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని రూపొందిస్తున్నారన్నారు. రామాయణం లాంటి మహాకావ్యాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో రణ్ బీర్ పై సన్నీ ప్రశంసలు కురిపించారు. అతడు గొప్ప నటుడని, రాముడి పాత్రకు వందశాతం న్యాయం చేశారని సన్నీ అన్నారు.

రామాయణ కోసం టెక్నీకల్ రంగంలో వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన మేకర్స్ ను డైరెక్టర్ నితేష్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్‌ అగ్ర నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ రూపొందిస్తున్నారు. అయితే, రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి కొత్తగా చెప్పడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాన్ని తెరపైకి తీసుకువస్తోన్న బాలీవుడ్ మేకర్స్ కి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనే ఆసక్తి నెలకొంది. రామాయణం పార్ట్ 1 దీపావళి 2026న విడుదల కానుంది, రెండవ భాగం దీపావళి 2027న థియేటర్లలోకి రానుంది.