Nagarjuna: స్టైలిష్ విలన్గా అదరగొట్టిన నాగార్జున.. కూలీ బ్లాక్ బస్టర్పై కింగ్ ఏమన్నారంటే?

Nagarjuna: స్టైలిష్ విలన్గా అదరగొట్టిన నాగార్జున.. కూలీ బ్లాక్ బస్టర్పై కింగ్ ఏమన్నారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటించిన ‘కూలీ’ దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కూలీ సినిమాలో నాగార్జున తన కెరీర్లో తొలిసారి విలన్ పాత్ర పోషించారు. సైమాన్ అనే స్టైలిష్ విలనిజంతో రజినీకాంత్కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలో హీరో నాగార్జున.. కూలీ సినిమాపై తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కో స్టార్ రజినీతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. 

నాగ్ కూలీ విశేషాలను పంచుకుంటూ..  ‘‘ఈ తరహా మాస్ యాక్షన్ థ్రిల్లర్లో రజనీకాంత్తో భాగస్వామ్యం కావడం ఒక మరపురాని అనుభవం. సినిమా కథలో ఉన్న శక్తికి గుర్తుగా దేవా (రజినీకాంత్) మరియు సైమాన్ (నాగార్జున) క్యారెక్టర్స్ పుట్టాయి. మేమిద్దరం తెరపై కనిపించినప్పుడు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సైమాన్ క్యారెక్టర్ చేసే థ్రిల్‌ ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుందని’’ అని నాగార్జున అన్నారు. 

లేటెస్ట్గా నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పలు ఫోటోలు పంచుకుంది. కూలీ సినిమా షూటింగ్లో నాగార్జున స్పెషల్ ఫొటోలు షేర్ చేస్తూ ‘కింగ్ కూలీ తెరపైకి రాకముందు ఏం జరిగిందో తెలియని బ్యూటిఫుల్ క్షణాలు ఇవి. ఇపుడు తెరపై సైమాన్ విధ్వంసం. నాగార్జున తన అత్యుత్తమ ప్రదర్శనలో కూలీ నిలిచిపోతుందని’ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.

►ALSO READ | Bharati Ghattamaneni: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేస్తోందోచ్..!

అందులో ఒక ఫొటోలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో షూట్ లోకేషన్లో నాగార్జున కనిపించారు. అలాగే, మరో రెండు ఫొటోల్లో రజినీతో యాక్షన్ మోడ్లో క్రేజీ లుక్లో నాగ్ దర్శనిమిచ్చారు. ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కింగ్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. కూలీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజు రూ.65 కోట్ల నెట్, రెండో రోజు శుక్రవారం నాడు రూ.53.50 కోట్ల నెట్ సాధించింది. కూలీ రెండు రోజుల్లో రూ.118.5 కోట్ల నెట్ వసూలు చేసింది.