డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం: నిండు గర్భిణి దారిలోనే మృతి

డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం: నిండు గర్భిణి దారిలోనే మృతి

పరిగి, వెలుగు: ఆమె నిండు గర్భిణి. ప్రసవం కోసం పరిగి దవాఖానకు వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగాడని తాండూరు దవాఖానకు పొమ్మన్నరు. ఆడికిపోతే.. డాక్టర్లు లేటుగా వచ్చారు. పరిస్థితి సీరియస్ గా ఉందని పట్నం పొమ్మన్నరు. తీరా అంబులెన్స్ రావడానికిమరో గంట లేటైంది. చివరకు హైదరాబాద్ తీసుకొస్తుండగా దారిలోనే కన్ను మూసింది. బాధితుల కథనం ప్రకారం..పరిగికి చెందిన షేర్ ఖాన్, జులేకాబేగం(24) దంపతులు. జులేకాబేగం నిండు గర్భిణి. గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో ఆమెను పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.

టెస్ట్ లు చేసిన డాక్టర్లు బిడ్డ అడ్డం తిరిగిందని తాండూ రులోని జిల్లాహా స్పిటల్ కి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ల‌గా అరగంట ఆలస్యంగా వచ్చిన డాక్ట‌ర్ టెస్ట్ చేసి కండీషన్ సీరియస్ గా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలన్నారు. తీరా అంబులెన్స్ లో తరలిస్తుంటే మొయినాబాద్ వద్దకు రాగానే జులేకాబేగం మృతిచెందింది. డెడ్ బాడీని పరిగి హాస్పిటల్ కి తీసుకొచ్చి ఆందోళన చేశారు. డీఎంఅండ్ హెచ్ వో దశరథ్ వారితో మాట్లాడి . విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.