
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్రమ క్రమంగా కోలుకుంటున్నారు. శుక్రవారం (డిసెంబర్ 8న) జరిగిన తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ సక్సెస్ కావడంతో.. డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ నడవడానికి ప్రయత్నిస్తున్నారు.
శనివారం (డిసెంబర్ 9న) సాయంత్రం యశోద ఆసుపత్రి డాక్టర్లు రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, నిత్యం వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. బెడ్ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారని వివరించారు.
కేసీఆర్ ఆరోగ్య పురోగతి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని డాక్టర్లు చెప్పారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం సర్జరీ చేసిన 12గంటల్లోగా నడిపించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.