30 నిమిషాలు పల్స్ లేకున్నా ప్రాణాలు కాపాడిన డాక్టర్లు

30 నిమిషాలు పల్స్ లేకున్నా ప్రాణాలు కాపాడిన డాక్టర్లు
  • అయోర్టా చీలికకు 10 గంటల సంక్లిష్ట సర్జరీ
  • కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ల ఘనత

గచ్చిబౌలి, వెలుగు: 30 నిమిషాల పాటు పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు.. రక్తపోటు లేదు.. రక్తప్రసరణ కూడా లేదు. అయినా సర్జరీ చేసి 64 ఏళ్ల మహిళ ప్రాణాలను కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు కాపాడారు. ప్రధాన రక్తనాళమైన అయోర్టాలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన చీలికకు సంక్లిష్టమైన సర్జరీ చేసి ఆమెకు పునర్జన్మనిచ్చారు. మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదేళ్లుగా హైబీపీతో బాధపడుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17న ఆమెకు తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది.

అయోర్టాలో తీవ్రమైన చీలిక ఉన్నట్లు సీటీ స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో బయటపడింది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆమెను కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలూరి, చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డియోథొరాసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మినిమల్లీ ఇన్వేసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోబోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిసర్గ నేతృత్వంలో డాక్టర్లు దెబ్బతిన్న అయోర్టాను తొలగించి కృత్రిమ రక్తనాళాన్ని అమర్చారు.

మెదడుకు హాని కలగకుండా తల చుట్టూ ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకులు అమర్చి, శరీర ఉష్ణోగ్రతను 18 డిగ్రీల సెంటీగ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గించారు. మెటబాలిజం రేటును పూర్తిగా నియంత్రించి, గుండె కొట్టుకోవడాన్ని అరగంట పాటు నిలిపివేసి బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఆపేశారు. సుమారు 30 నిమిషాల పాటు శరీరంలో పల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రక్తపోటు, సాధారణ రక్తప్రసరణ లేకుండానే సర్జరీ నిర్వహించారు.

మొత్తం 10 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం రక్తప్రసరణను క్రమంగా పునరుద్ధరించి, శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థాయికి తీసుకువచ్చారు. దీంతో గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది. అనంతరం పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐసీయూకు తరలించగా, కొన్ని గంటల్లోనే వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించారు. మరుసటి రోజు నుంచే ఆమె స్పష్టంగా మాట్లాడగలిగారు.