వ్యాక్సిన్ వాయిదా వేయొద్దు

వ్యాక్సిన్ వాయిదా వేయొద్దు

కొవిడ్​ అలలు అలలుగా తరుముకొస్తోంది. ఇప్పుడు వ్యాక్సినే కరొనా వైరస్​కు విరుగుడని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్​ హెల్దీగా ఉన్నవాళ్లకేనా? హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లు కూడా తీసుకోవచ్చా? అని చాలామందికి డౌట్​. అన్ని సమస్యల కంటే కరోనా సమస్యే ప్రాణాంతకం కాబట్టి వ్యాక్సిన్​కే జై కొట్టండని డాక్టర్లంటున్నారు. అయినా ఎన్నో భయాలు. ఏ ప్రాబ్లమ్​ ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేర్ హాస్పిటల్​ జనరల్​​ ఫిజిషియన్​ డాక్టర్​ నవోదయ చెబుతున్నారు. 

కొవిడ్​ తగ్గిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్​ తీసుకోవాలి.?

కొవిడ్ ​నుంచి కోలుకున్నవాళ్లలో యాంటీ బాడీస్​ మూడు నెలల వరకు ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్​ తీసుకున్నా ఉపయోగం ఉండదు. మూడు నెలల తర్వాత వ్యాక్సిన్​ తీసుకుంటే ఇంకొంతకాలం సేఫ్టీగా ఉండొచ్చు.  
బీపీ ఉన్నవాళ్లు తీసుకుంటే ఇబ్బందులు ఉంటాయా? 
బీపీ పేషెంట్స్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. అయితే తీసుకునే ముందు బీపీ చెక్​ చేసుకోవాలి. వ్యాక్సిన్​ కోసం వెళ్లినప్పుడు సడన్​గా బీపీ పెరగొచ్చు. కాబట్టి తప్పకుండా బీపీ  పేషెంట్స్​ బీపీ చెక్​ చేసుకుని మాత్రమే వ్యాక్సిన్​ తీసుకోవాలి. బీపీ170/180 మధ్య ఉంటే కాసేపు అక్కడే కూర్చుని, బీపీ తగ్గాక వ్యాక్సిన్​ వేయించుకోవాలి.   
ఇన్సులిన్​ ఆపాలా? 
షుగర్​ పేషెంట్స్​ కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకునే రోజు కూడా ఇన్సులిన్​ తీసుకోవాలి. వ్యాక్సిన్​ ఇచ్చే విధానం సరిగా ఉండాలి. షుగర్​ పేషెంట్స్​కి ఇన్ఫెక్షన్లు రావడం చాలా సాధారణం. వస్తే తగ్గవు. కాబట్టి వ్యాక్సిన్​ ఇచ్చేచోట స్పిరిట్​తో సరిగా క్లీన్​ చేయాలి. షుగర్​ పేషెంట్స్​కి చాలా కేర్​ఫుల్​గా వ్యాక్సిన్​ ఇవ్వాలి కాబట్టి  మెడికల్​ స్టాఫ్​కి వ్యాక్సిన్​ తీసుకునేముందు ‘షుగర్​ పేషెంట్’​ అని గుర్తుచేస్తే మంచిది. తర్వాత రోజుల్లో కూడా ఇన్సులిన్​ని రెగ్యులర్​గా తీసుకున్నట్లే తీసుకోవాలి. 
కీమో తీసుకున్న వాళ్లు ఎప్పుడు తీసుకోవాలి? 
కీమో చేసిన తర్వాత ఇన్ని రోజులకు తీసుకోవాలన్న నియమం లేదు. వీలునిబట్టి, డాక్టర్​ సలహాతో క్యాన్సర్​ పేషెంట్స్​ వ్యాక్సిన్​ తీసుకోవాలి. క్యాన్సర్​ పేషెంట్స్​, ఆర్గాన్​ ట్రాన్స్​ప్లాంట్​ చేయించు కున్న వాళ్లు, సర్జరీ చేయించుకున్న వాళ్లు, ఆస్తమా, న్యూరో ప్రాబ్లమ్​ ఉన్నవాళ్లు కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. వ్యాక్సిన్​ తీసుకున్నాక ఏదైనా ఇబ్బంది వస్తే ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్​ని మాత్రమే కన్సల్ట్ అవ్వాలి. వాళ్లు చెప్పినట్లుగా మందులు వాడాలి. 
అలర్జీ పేషెంట్స్​ తీసుకోవచ్చా? 
కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకుంటే అలర్జీ రాదు. అలర్జీలతో బాధపడుతున్నవాళ్లు కూడా కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్​ వల్ల అప్పటికే ఉన్న అలర్జీ పెరగడం కూడా ఉండదు. 
ఆపరేషన్​  వాయిదా వేయాలా? 
ఒంట్లో రోగం, కరోనా వైరస్​ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదమో చూసుకుని వ్యాక్సిన్​ తీసుకోవాలి. వ్యాక్సిన్​ తీసుకున్నవాళ్లలో సెకండ్​ డోస్​ తీసుకున్న రెండు వారాల తర్వాత మాత్రమే కరోనా వైరస్​  నుంచి కాపాడే యాంటీ బాడీస్​ డెవలప్​ అవుతాయి. 

రెండు డోసులు తీసుకోవడానికి ఉన్న పిరియడ్, యాంటీ బాడీస్​ డెవలప్​ అయ్యే టైమ్​ని బట్టి ఆపరేషన్​ని మూడు నెలలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆపరేషన్​ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్స్​ చెబితే వెంటనే వ్యాక్సిన్​ వేయించుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్​కి ఆపరేషన్​ వాయిదా వేయడం కుదరదు. కాబట్టి వెంటనే ఆపరేషన్​ చేయించు కోవాలి. కొవిడ్​​ పేషెంట్స్​కి ట్రీట్​మెంట్​ చేయని హాస్పిటల్​ లో చేరితే సేఫ్టీగా ఉంటుంది. 

డాక్టర్ నవోదయ
కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్,
కేర్ హాసిప్టల్ , బంజారాహిల్స్ , హైదరాబాద్