భారీ వర్షాలకు దెబ్బతిన్న డొడర్నా చెరువు కట్ట

భారీ వర్షాలకు దెబ్బతిన్న డొడర్నా చెరువు కట్ట

కుభీర్, వెలుగు: భారీ వర్షాలకు కుభీర్ మండలంలోని డోడర్నా దెబ్బతింది. చెరువు కట్టకు ఇటీవలే రూ.9 లక్షలతో రిపేర్లు చేశారు. పనులు నాసిరకంగా జరిగాయంటూ పలువురు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్ట దెబ్బతిన్న విషయం తెలుసుకున్న ఎమ్మార్వో, ఎంపీడీవో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.

ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తగా తూము నుంచి నీటిని వదిలారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాసిరక రిపేర్లు చేసిన కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.