పాత పగలు మనసులో పెట్టుకున్నట్టు.. ఈ కుక్కేంటి ఇలా మీద పడి కరిచేసింది!

పాత పగలు మనసులో పెట్టుకున్నట్టు.. ఈ కుక్కేంటి ఇలా మీద పడి కరిచేసింది!

కరిచే కుక్క అరవదని చెబుతుంటారు. ఈ వీడియో చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వీడియో తెగ వైరల్ అయింది. ఒక కుక్క సైలెంట్గా వచ్చి ముగ్గురూ తాపీగా కూర్చుని టీ తాగుతుంటే వాళ్ల మీద పడి కరిచేసింది.

అత్యంత అమానుషంగా దాడి చేసింది. వాళ్లు ఎదురు తిరిగి కొట్టబోతే పారిపోతూ ఎదురు పడిన మరో యువకుడిపై కూడా అటాక్ చేసింది. ఇలా ఎవరు కనిపిస్తే వాళ్ల మీద పడి పాత పగలుప్రతీకారాలు ఏవో మనసులో పెట్టుకున్నట్లు ఎగబడి కరిచేసింది. అప్పటి వరకూ చాలా మాములుగా అక్కడే తిరుగుతున్న కుక్క ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడంతో కాసేపు అక్కడున్న వాళ్లకు ఏం అర్థం కాలేదు. ఇలా కరిచేసిందేట్రా బాబూ అని అవాక్కయ్యారు.

కుర్చీతో కొడితే కుర్చీ విరిగిపోయింది గానీ కుక్క కసి మాత్రం తీరలేదు. కుర్చీతో కొట్టిన తర్వాత కూడా అక్కడున్న వాళ్లపై ఎగబడింది. కుక్కలకు ఉండే  విశ్వాసం మీద  పూర్తి  నమ్మకం ఉన్న  ప్రజలకు ఇలాంటి ఘటనలతో ఈ మధ్య ఆ నమ్మకం కాస్తా సన్నగిల్లుతుంది. వాటికి  మనుషుల మీద విశ్వాసం తగ్గిందా?  మనకు వాటి మీద  నమ్మకం పోయిందా? ఇటీవలి జరుగుతున్న  పరిణామాలు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. కుక్క కాటు  సంఘటనలు ఎక్కువ అయ్యాయి.  కరవడమే  కాకుండా  చంపేస్తున్న  సంఘటనలు కూడా పెరుగుతున్నాయి.