తప్పిపోయిన కుక్కపిల్ల ఏడేళ్లకి దొరికింది

తప్పిపోయిన కుక్కపిల్ల ఏడేళ్లకి దొరికింది


ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లోరిడా మహిళకి పెట్స్​ అంటే  భలే ఇష్టం. ఆమె పెంచుకుంటున్న పెప్పర్​ అనే కుక్కపిల్లయితే ప్రాణం. ఆరేళ్ల పెప్పర్​తో  హ్యాపీగా సాగిపోతోందామె  లైఫ్​. కానీ, అంతలోనే ఉన్నట్టుండి  పెప్పర్​ మాయమైంది. ఎంతవెతికినా జాడ దొరకలేదు.‘ఇటెన్​ కంట్రీ యానిమల్​ కంట్రోల్’​కి కూడా కంప్లైట్​ ఇచ్చింది. అలా రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆశలన్నీ వదిలేసుకున్న టైంలో పెప్పర్​ మిస్​ అయిన ఏడేళ్లకు ఓ ఫోన్​ కాల్​ వచ్చింది ఈ మహిళకి. ‘మేము ఇటెన్​ కంట్రీ యానిమల్​ కంట్రోల్​ నుంచి మాట్లాడుతున్నాం’ అన్నారు అవతలివాళ్లు. ‘మీ పెప్పర్​ దొరికింద’ని చెప్పారు. ఆ మాట వినగానే పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది ఆ మహిళ. ఏడేళ్ల తర్వాత దాదాపు వెయ్యిమైళ్ల దూరంలో ఉన్న పెప్పర్​ని ఆమెకి అప్పగించారు అధికారులు. పెప్పర్​ను ముద్దు చేస్తున్న ఫొటో ఇప్పుడు అందరి మనసుల్ని దోచుకుంటోంది. అయితే పెప్పర్​ని ట్రేస్​ చేయడానికి తనకి చిన్నప్పుడు అమర్చిన మైక్రోచిప్​ హెల్ప్​ చేసింది అంటున్నారు అధికారులు. పెట్​​ లవర్స్​ అంతా  తమ పెట్స్​కి మైక్రోచిప్​ అమర్చుకోవాలని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్​.