పులి కూనలను అక్కున చేర్చుకున్న శునకం

పులి కూనలను అక్కున చేర్చుకున్న శునకం

అమ్మ ప్రేమకు దూరమైన మూడు పులి పిల్లలను అక్కున చేర్చుకుంది ఏ లాబ్రాడర్ డాగ్. ఓ పులి దానికి పుట్టిన మూడు పిల్లలను పుట్టినప్పటి నుంచి దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో జూ నిర్వాహకులు.. ఆ పులి కూనల ఆలనా పాలనను ఓ శునకానికి అప్పజెప్పారు. ఈ ప్రయత్నం ఫలించలేదేమో అని, పులి కూనల పరిస్థితిపై ఆందోళన చెందారు నిర్వాహకులు. కానీ, ఆ పులి కూనలను అక్కున చేర్చుకుంది శునకం. చైనా జూలోని ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. సాధారణంగా తల్లి పులి చనిపోయినప్పుడు కూనలు అనాథలు అవుతుంటాయి. కానీ.. పాలిచ్చే పెంచే ఓపిక లేనప్పుడు కూడా పులులు ఇలా కూనల్ని దగ్గరకు రానివ్వకుండా కసురుకుంటాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది. అడవుల్లో అయితే కొన్ని సందర్భాల్లో తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తుంటాయని తెలిపింది.