Good Health : ఇంటి పని మనసుకూ మంచిదే.. ఉల్లాసం ఇస్తుంది..!

Good Health : ఇంటి పని మనసుకూ మంచిదే.. ఉల్లాసం ఇస్తుంది..!

వారానికి కనీసం ఇరవై నిమిషాలైనా ఇంటిపని చేస్తే మానసిక ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దాదాపు ఇరవైవేల మంది స్త్రీ, పురుషులను ప్రశ్నించి ఫలితాలను ప్రచురించారు. ఈ సర్వేల్లో పాల్గొన్న ప్రతివ్యక్తి మానసికస్థితిని, వారంలో వారి శారీరక కార్యకలాపాలను ప్రశ్నించి వివరాలు రాబట్టారు.

సర్వేలో పాల్గొన్న మూడు వేలమంది పైగా తాము ఒత్తిడికి, ఉద్వేగానికి గురవుతున్నట్లుగా భావిస్తున్నట్లు అధ్యయనాల్లో తెలిపింది. ఈ వివరాలను విశ్లేషించిన తర్వాత ఇంటిపని, తోటపని, నడక లాంటి పనులతో పాటు ఏదో ఒక విధమైన శారీరక పనులను రోజూ చేస్తున్న వాళ్లలో ఒత్తిడి తగ్గుతున్నట్లు పేర్కొన్నారు.

అన్నిటి కంటే ఎక్కువగా గేమ్స్ మనిషి ఒత్తిడిని ముప్పైమూడు శాతం దాకా తగ్గిస్తున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కేవలం ఇరవై నిమిషాల పాటు శారీరక పనిచేస్తే చాలు.. అది మన మానసిక స్థితిని ఎంతగానో మెరుగు పరుస్తుందని అధ్యయనం చెప్పింది. శారీరక శ్రమ గుండెజబ్బుల్ని. క్యాన్సర్లను నివారిస్తుందని వీళ్లు చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధముండే ఇన్స్టలరేషన్, ఇన్ఫ్లమేషన్ లాంటివి తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.