అలాచేస్తే వెంట్రుకల కొసలు  చిట్లుతాయి

అలాచేస్తే వెంట్రుకల కొసలు  చిట్లుతాయి

తలకు నూనె ఎక్కువ పెడితే మాడు జిడ్డుగా ఉండి, మలాస్సెజీ అనే ఫంగస్​ పెరిగి చుండ్రు వస్తుంది. కొన్నిసార్లు మాడుకి ఇన్​ఫ్లమేషన్​ వచ్చి జుట్టు రాలిపోతుంది. నూనె ఎక్కువగా అంటుకుంటే కుదుళ్ల దగ్గర ఎర్రటి కురుపులు వస్తాయి. ఈ కండీషన్​ని ‘స్కారియా అలొపేసియా’ అంటారు అంటోంది డెర్మటాలజిస్ట్, హెయిర్​ స్పెషలిస్ట్ సువిన అట్టావరి. ఇందుకు సొల్యూషన్​ కూడా చెప్పిందామె. 

  • నూనె రాసుకున్నాక తలకు మసాజ్​ చేస్తున్నప్పుడు జుట్టుని బలంగా అటుఇటు లాగుతుంటారు. దాంతో వెంట్రుకలు  రాలిపోతాయి. అందుకని నూనె పెట్టాక ఐదు నిమిషాలు మాత్రమే మసాజ్​ చేసుకోవాలి.
  • వెంట్రుకలకి నూనె పట్టించాక బిగుతుగా కొప్పు లేదా జడ వేసుకోవద్దు. అలాచేస్తే వెంట్రుకల కొసలు  చిట్లుతాయి. జుట్టు ఊడుతుంది. 
  • నూనె రాసుకుని బయటకెళ్తే తలపై దుమ్ము  చేరుతుంది. నిద్రపోయినప్పుడు దిండు, పరుపు మీది  మురికి కూడా వెంట్రుకలకి అంటి జుట్టు రాలిపోతుంది. 
  • జుట్టుకు గోరు వెచ్చటి నూనె రాసుకోవాలి. అలాగైతేనే తొందరగా వెంట్రుకలు, కుదుళ్ల లోపలకి నూనె వెళ్తుంది. మాడుకి రక్త ప్రసరణ పెరిగి, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.