Good Health:రోజూ కప్పు కాఫీ తాగితే చాలు..ఇట్టే కొవ్వు కరుగుతుంది..గ్రెనడా యూనివర్శిటి నివేదిక ఇదే..! 

Good Health:రోజూ కప్పు కాఫీ తాగితే చాలు..ఇట్టే కొవ్వు కరుగుతుంది..గ్రెనడా యూనివర్శిటి నివేదిక ఇదే..! 

కాఫీ తాగడం అంటే ఇష్టమా? రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే మీకో గుడ్ స్యూస్. లేవగానే కప్పు కాఫీ తాగితే నిద్రమత్తు వదులుతుందని అనుకుంటాం. కానీ, కాఫీ తాగడం వల్ల అంతకంటే మంచే జరుగుతుందట. కాఫీ వల్ల బాడీలోని ఫ్యాట్ కరుగుతుందట. బరువు తగ్గేందుకు ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు... వర్కవుట్స్ కు ఒక గంట ముందు కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగితే మస్తు రిజల్ట్ వస్తుందంటున్నారు గ్రెనడా యూనివర్శిటీ ఫిజియాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్లు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్లో కాఫీపై వాళ్లు చేసిన స్టడీ పబ్లిష్ అయ్యింది.

కాఫీ లవర్స్​ కు  గ్రెనడా యూనివర్శిటీ కాఫిజియాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్స్​  గుడ్​ న్యూస్ చెప్పారు. కాఫీ తాగడం వల్ల ఒంట్లోని ఫ్యాట్ కరుగుతుందని అంటున్నారు. మూడు మిల్లీగ్రాముల కెఫిన్.. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీతో సమానం. అందుకే  ఎయిరోబిక్స్ చేసే వాళ్లకు అరగంటముందు కెఫిన్ ఇచ్చి సైంటిస్టులు వాళ్లపై రీసెర్చ్ చేశారు. కెఫిన్ ఇచ్చిన వారిలో ఫ్యాట్ బాగా కరిగినట్లు గమనించారు. అంతేకాకుండా కెఫిన్ తీసుకున్నప్పుడు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం కంటే మధ్యాహ్నం చేసిన ఎక్సర్సైజ్​ కే  మంచి రిజల్ట్ వచ్చిందట. 

ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ ఆడేవాళ్లకు ఎనర్జీ ఇచ్చే పదార్థాల్లో కెఫిన్ ఒకటి. అలాంటప్పుడు అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆక్సిడేషన్ పెంచుతుందా? లేక కొవ్వును బర్న్ చేయడంలో సాయపడుతుందా? అనేది తెలుసుకునేందుకు ఈ రీసెర్చ్ చేశారు."ఫ్యాట్ ఆక్సిడేషన్​ ను పెంచేందుకు ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయాయం చేయమని సిఫార్సు చేస్తుంటారు. అయితేఅది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. ఎక్సర్​ సైజ్​చేయడం వల్ల అలా జరిగిందా? లేక ఎక్కువ టైం తినకుండా ఉండటం వల్ల జరిగిందా అనే విషయం తెలియదు. 32 అంతకంటే తక్కువ వయసు ఉన్న 15 మందిపైన ఈ రీసెర్చ్ చేశారు.

 ఏడు రోజుల్లో నాలుగుసార్లు ఎక్సర్​ సైజ్ టెస్ట్ చేశారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు 3ఎంజీ కెఫిన్ తీసుకున్న వాళ్ల పైన స్టడీ చేశారు. ప్రతిసారి ఎక్సర్ సైజ్​ చేసేకంటే ముందు, చేసేటప్పుడు ఫ్యాట్ ఆక్సిడేషన్ ఎలా ఉందనే విషయాన్ని నోట్ చేసుకున్నారు.అయితే, ఎయిరోబిక్స్ చేసే అరగంట ముందు కెఫిన్ తీసుకుంటే మ్యాగ్జిమమ్ ఫ్యాట్ ఆక్సిడేషన్ జరిగింద" ని తేల్చాం అన్నారు రీసెర్చ్ హెడ్ ఫ్రాన్సిస్కో జోస్ అమారో.