Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ఎమోషనల్ అయిన డైరెక్టర్ ఆదిత్య ధర్

Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ఎమోషనల్ అయిన డైరెక్టర్ ఆదిత్య ధర్

ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) హవా కొనసాగుతోంది. ఒకవైపు రికార్డులను తిరగరాసే స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ నమోదు అవుతుండగా, మరోవైపు స్టార్ హీరోల నుంచి ప్రశంసలు వరుసగా వెల్లువెత్తుతున్నాయి. ‘ధురంధర్ 2’ ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణమైన అల్టిమేట్ కంటెంట్‌తో పాటు, డైరెక్టర్ ఆదిత్య ధర్ విజన్, హీరో రణవీర్ సింగ్ నటనపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

లేటెస్ట్గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా సోషల్ మీడియా వేదికగా ‘ధురంధర్ 2’పై తన అభినందనలు తెలియజేశారు. దీంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

తలైవా X వేదికగా పోస్ట్‌ చేస్తూ.. “ధురంధర్ 2 చాలా అద్భుతమైన చిత్రం. డైరెక్టర్ ఆదిత్య ధర్.. నిజంగా బాక్సాఫీస్‌కే బాప్. హీరో రణవీర్ సింగ్కు, అలాగే చిత్ర బృందం మొత్తానికి హ్యాట్సాఫ్. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది. జై హింద్” అని రజనీ ట్వీట్ చేశారు.

సినిమాను ప్రశంసిస్తూ, ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రమని రజినీకాంత్ పేర్కొనడంతో దర్శకుడు ఆదిత్య ధర్ ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా “మాకు పెద్ద కలలు కనేలా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి నుంచి వచ్చిన ఈ ప్రశంస ఒక వరంలా భావిస్తున్నాను” అని ఆదిత్య తెలిపారు.

ఆదిత్య ధర్ X వేదికగా రజనీకాంత్ ట్వీట్‌పై స్పందిస్తూ.. “సర్, మేమందరం ‘వినోదం’ అనే పదాన్ని ఒకే ఒక కొలమానంతో అర్థం చేసుకుంటూ పెరిగాం. అది మీరే.  దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఈలలు వేయిస్తూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ, జీవితంలో మరపురాని అనుభూతిని కలిగిస్తూ.. వినోదానికి అసలైన అర్థం చెప్పారు. ఇప్పటికీ అదే స్టైల్‌, అదే గ్రేస్‌తో మీరు సృష్టిస్తున్న మ్యాజిక్ అద్భుతంగా ఉంది.

అలాంటి మీరు ‘ధురందర్ 2’ను తప్పక చూడాల్సిన సినిమాగా ప్రశంసించడం నా జీవితంలోనే అత్యంత గొప్ప ‘సూపర్‌స్టార్’ క్షణంగా అనిపిస్తోంది. మాకు పెద్ద కలలు కనడం నేర్పిన వ్యక్తి నుంచే ఈ ప్రశంస రావడం ఒక ఆశీర్వాదంలా ఉంది. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సర్. మీ మాటలు నా మనసును ఎంతో తాకాయి. జై హింద్” అని డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎమోషనల్ పోస్ట్తో తలైవాకు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్.. సినీ ఆడియన్స్ను అట్ట్రాక్ట్ చేస్తోంది. 

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఆర్జీవీ, అల్లు అర్జున్, రాజమౌళి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ, తమ అభిమానాన్ని పంచుకున్నారు.