మహిళలకు ఆటో కంపెనీల్లో ప్రాధాన్యం

మహిళలకు ఆటో కంపెనీల్లో ప్రాధాన్యం
  • ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు

న్యూఢిల్లీ:  దేశీయ ఆటోమేకర్స్ టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్,  హీరో మోటోకార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు షాప్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల (ఫ్యాక్టరీల)లో భారీగా మహిళలను నియమించుకుంటున్నాయి. ఉద్యోగుల్లో మహిళల వాటాను పెంచుతున్నాయి. ఇప్పుడు వేలాది మంది మహిళలు  టూవీలర్​, కార్లు,  భారీ కమర్షియల్​ కంపెనీల ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. టాటా మోటార్స్ నిర్వహించే ఆరు ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని షాప్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 4,500 మందికి పైగా మహిళలు పని చేస్తున్నారు.  పూణే ఫెసిలిటీలో మొత్తం 1,500 మందికి పైగా ఆడవాళ్లు హారియర్,  సఫారీ వంటి ప్రసిద్ధ ఎస్​యూవీలను ఉత్పత్తి  చేస్తున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది తమ విధానమని, ముఖ్యంగా షాప్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  25 శాతం మంది మహిళలు ఉంటారని అని టాటా మోటార్స్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్  చెప్పారు.  మహిళా ఉద్యోగులు చిన్న ప్యాసింజర్ కార్ల నుంచి భారీ వాణిజ్య వెహికల్స్ వరకు అన్ని రకాల బండ్లు తయారు చేస్తున్నారని చెప్పారు. 

మరో వెహికల్​ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) మాన్యుఫాక్చరింగ్​ ప్లాంట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం 1,202 కి చేరుకుంది. వెల్డింగ్​, రోబోటిక్స్ లోడింగ్, వెహికల్ అసెంబ్లింగ్  మెషిన్ షాప్ వంటి బాధ్యతలను అతివలకు అప్పగిస్తున్నారు. ఈ విషయమై ఎం&ఎం  సీహెచ్​ఆర్​ఓ రాజేశ్వర్ త్రిపాఠీ మాట్లాడుతూ తమ కంపెనీ 25కి పైగా పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు) నుంచి ఉద్యోగులను తీసుకుంటుందని, వాటిలో కొన్ని పూర్తిగా మహిళా ఐటీఐలు ఉన్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో సుమారు ఎనిమిది ఐటీఐలను దత్తత తీసుకున్నామని వెల్లడించారు. ఎక్కువ మంది మహిళలు ఆటోమొబైల్ తయారీలోకి ప్రవేశించడంలో సవాళ్ల గురించి అడిగినప్పుడు, వాళ్లు చాలా బాగా పనిచేస్తారని, ఇబ్బందులను ఎదుర్కొంటారని తెలిపారు. కొంతమంది మహిళలకు కుటుంబం నుంచి సహకారం ఉండటం లేదన్నారు. 

మహిళలతో అసెంబ్లింగ్ ​లైన్​

కమర్షియల్​ వెహికల్స్​ తయారీ సంస్థ అశోక్ లేలాండ్​లో 991 మంది మహిళలు దాని ఏడు ప్లాంట్లలో పనిచేస్తున్నారు. కంపెనీ హోసూర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, దాదాపు 120 మంది మహిళలతో కూడిన అసెంబ్లింగ్ లైన్ ఉంది. ఇక్కడ ఒక్కో షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 120 ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉత్పత్తి చేస్తారు. సంస్థ ప్రెసిడెంట్ & చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గణేష్ మణి మాట్లాడుతూ, ఏ ఉద్యోగానికైనా స్త్రీ, పురుషులిద్దరూ అర్హులేనని ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నామని వివరించారు. కంపెనీ  పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్ ప్లాంట్ ట్రక్ అసెంబ్లీలో పాల్గొనే మహిళా ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాదాపు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెద్ద స్థానాలకు వెళ్లవచ్చని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,500 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.