దేశీయ మొబైల్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ బీహెచ్​ఏఆర్​ఓఎస్​

దేశీయ మొబైల్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ బీహెచ్​ఏఆర్​ఓఎస్​
  •  మొబైల్​ ఫోన్లలో ఉపయోగపడే బీహెచ్​ఏఆర్​ఓఎస్​ను ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) – మద్రాస్​ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, అశ్వినీ వైష్ణవ్​ స్వయంగా బీహెచ్​ఏఆర్​ఓఎస్​ను పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు. 
  •     బీహెచ్​ఏఆర్​ఓఎస్​ ఉచిత, ఓపెన్​ – సోర్స్​ ఆపరేటింగ్​ సిస్టమ్​. ఇది నో డిఫాల్ట్​ యాప్స్తో వస్తుంది. అంటే బీహెచ్​ఏఆర్​ఓఎస్​ ​ను ఇన్​స్టాల్​ చేసుకున్న ఫోన్​లో ఎలాంటి యాప్​లు కనిపించవు. 
  • డిఫాల్ట్​గా వచ్చే యాప్​లతో మోసాలకు గురవుతుండటం వినియోగదారులకు అనుభవమే. అందుకే బీహెచ్​ఏఆర్​ఓఎస్​ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్​లను ప్రైవేట్​ యాప్​ స్టోర్​ సర్వీసెస్​ (పాస్​) నుంచి డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.
  •     పాస్​లో బాగా నమ్మకమైన ప్రభుత్వ అనుమతి ఉన్న అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్​లు మాత్రమే ఉంటాయి.
  •     ఐఐటీ – మద్రాస్​ ఆధ్వర్యంలో స్థాపించిన జే అండ్​ కే ఆపరేషన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ (జండ్​కాప్స్​) అనే లాభాపేక్ష లేని స్టార్టప్​ కంపెనీ బీహెచ్​ఏఆర్​ఓఎస్​ను అభివృద్ధి చేసింది.
  •     నేషనల్​ మిషన్​ ఆన్​ ఇంటర్​ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్​ సిస్టమ్స్​ కింద కేంద్ర సైన్స్​ అండ్​ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది.
  •     కఠినమైన భద్రత, గోప్యత అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం బీహెచ్​ఏఆర్​ఓఎస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ను పరీక్షిస్తున్నాయి.