
హైదరాబాద్, వెలుగు: హై-ఎండ్ హోమ్ ఫర్నిషింగ్ బ్రాండ్ డోమిసిల్ జర్మనీ ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని క్వాడ్రో లివింగ్ స్టోర్‌లో 'సిగ్నేచర్ సోఫాస్'కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా రూపొందించిన ఈ సోఫాలు సౌకర్యం, చేతివృత్తి నైపుణ్యంతో వస్తాయని తెలిపింది.
ఈ కలెక్షన్‌లోని ప్రతి సోఫా లెదర్, ఫ్యాబ్రిక్‌లలో లభిస్తుంది. 30 కంటే ఎక్కువ లెదర్, 75 ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఉన్నాయి. వినియోగదారులకు వారి ఇంటికి సరిపోయేలా సోఫాను మార్చుకోవచ్చు. కూబో, బిల్బావో, ఆర్డియా, బైలీ వంటి సోఫాలు ఇక్కడ లభిస్తాయని డొమిసిల్ జర్మనీ తెలిపింది.