ప్రతిభావంతులకే గ్రీన్​కార్డ్ – ట్రంప్ ప్రతిపాదన

ప్రతిభావంతులకే గ్రీన్​కార్డ్ – ట్రంప్ ప్రతిపాదన
  • కొత్త వలస విధానాలకు ట్రంప్​ ప్రతిపాదనలు 
  • వేలాది మంది ఇండియన్లకు వరం

బోతోంది. కుటుంబ ఆధారిత విధానం కాకుండా ప్రతిభావంతులకే వీసా ఇచ్చేలా వలస విధానాల్లో మార్పులు తేబోతున్నారు. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రతిపాదించనున్నారు. ఏటా ఇస్తున్న 11 లక్షల గ్రీన్​కార్డుల్లో సగానికిపైగా ప్రతిభ, వృత్తిగత నైపుణ్యాలున్నవాళ్లకే ఇచ్చేలా విధానాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దశాబ్ద కాలంగా గ్రీన్​కార్డు కోసం వేచి చూస్తున్న వేలాది మంది ఇండియన్లకు వరం కాబోతోంది. చాలా మంది నైపుణ్యం ఉన్న ఇండియన్లు ఇప్పటికే చాలా కాలంగా వెయిటింగ్​ లిస్టులో ఉన్నారు. ఈ ప్రతిపాదనలతో వారి వెయిటింగ్​ టైం చాలా వరకు తగ్గనుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, జపాన్​ వంటి దేశాల్లో అమలు చేస్తున్న పాయింట్ల ఆధారిత వ్యవస్థలాగానే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రతిభ ఉన్న విద్యార్థులు, అసాధారణ నైపుణ్యాలున్నవాళ్లకు లాభం జరుగుతుందంటున్నారు. వయసు, ఇంగ్లిష్​ మాట్లాడడంలో నైపుణ్యాలు, ఎంప్లాయ్​మెంట్​ ప్రాతిపదికన పాయింట్లు ఇస్తారని చెబుతున్నారు. దీని వల్ల తక్కువ ఆదాయం వచ్చే అమెరికా ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండబోదని చెబుతున్నారు. కాగా, ట్రంప్​ అల్లుడు జార్​డ్​ కుష్నర్​ ఆలోచనల నుంచి పుట్టిందీ కొత్త విధానం. సరిహద్దు భద్రతను పటిష్టపరచడం, ప్రతిభ, పెద్ద డిగ్రీలు, వృత్తిగత అర్హతలున్నోళ్లకే గ్రీన్​కార్డ్​(శాశ్వత నివాస హోదా) ఇచ్చేలా వలస విధానాల్లో సమూల మార్పులపై ఆయన ఓ నివేదిక తయారు చేశారు. ప్రస్తుతం 66 శాతం గ్రీన్​కార్డులను కుటుంబం ఆధారంగానే ఇస్తున్నారు. 12 శాతం గ్రీన్​కార్డులనే ప్రతిభ ఆధారంగా ఇస్తున్నారు. దానికి చెక్​పెట్టడం కోసమే ఈ కొత్త విధానానికి తెరతీయబోతున్నారు.

ఎన్నికల వ్యూహమా?

దీనిపై కాంగ్రెస్​ సభ్యులు భిన్న స్వరాలు వినిపిస్తుం డడంతో అది ఎంతవరకు అమలుకు నోచుకుంటుం దన్నదానిపైనే అనుమానాలున్నాయి. తన సొంతపార్టీ (రిపబ్లికన్ ) అభ్యర్థు లను ట్రంప్ ఒప్పించగలిగినా, నాన్సీ పెలోసీ నేతృత్వంలోని డెమొక్రాట్లు, హౌస్​ స్పీకర్​, సెనేట్ మైనారిటీ లీడర్​ చుక్​ షూమర్​లను ఎంత వరకు ఒప్పిస్తా రన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాకు వచ్చే ఏడాది (2020) ఎన్ని కలు జరగనున్నాయి. ఎన్ని కల నేపథ్యంలోనే దీనిని ఇష్యూ చేయాలని ట్రంప్ సర్కారు
కసరత్తులు చేస్తోందన్న వారూ లేకపోలేదు. ఒకవేళ డెమొక్రాట్లుగానీ ఈ విధాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎన్నికల ఇష్యూ గా మారుతుందని, ఒకవేళ ఆ మార్పులకు వాళ్లు ఒప్పుకుంటే చర్చలద్వారా దానిని ఆమోదింపజేసుకునే అవకాశం ఉంటుందని సీనియర్​ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వలస విధానాల గురించి ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నేతలకు ట్రంప్ , కుష్నర్​లు వివరించి నట్టు తెలుస్తోంది.