తన నిర్ణయాన్ని సమర్థించుకున్న డోనాల్డ్ ట్రంప్

తన నిర్ణయాన్ని సమర్థించుకున్న డోనాల్డ్ ట్రంప్

తాను యాంటీ మలేరియల్ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఆయన ఈ ఔషధాన్ని తీసుకోవడంపై హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి సోమవారం విమర్శించారు. ‘కరోనావైరస్ సంక్రమణ నుంచి దూరంగా ఉండటానికి ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది. కానీ, ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. ట్రంప్ అనారోగ్యంగా ఉన్నాడు. ఈ డ్రగ్ వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని ఆమె అన్నారు.

పెలోసి వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇటలీ మరియు ఫ్రాన్స్ నుంచి వచ్చిన కొన్ని నివేదికలను పరిశీలిస్తే కరోనా ఎదుర్కొవడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. మా ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు చాలామంది దీనిని వాడుతున్నారు. అంతేకాకుండా.. ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మందు మలేరియా, లూపస్ మరియు ఇతర వ్యాధులను తగ్గించడానికి దాదాపు 65 సంవత్సరాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది అందరికీ అదనపు భద్రతను కల్పిస్తుందని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం’ అని ఆయన అన్నారు.

తాను డ్రగ్ తీసుకోవడాన్ని విమర్శించిన పెలోసి తన సమయాన్ని వృథా చేసుకుంటుందని ఆయన అన్నారు. ఆమె వ్యాఖ్యలపై తాను ఎక్కువగా స్పందించుకోదలచుకోలేదని ఆయన అన్నారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైక్ ఫ్లిన్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. పెలోసి అనారోగ్యంతో ఉంది. ఆమెకు చాలా మానసిక సమస్యలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.