ట్రంప్ ను దేవుడిగా కొలిచిన జనగామ వాసి మృతి

ట్రంప్ ను దేవుడిగా కొలిచిన జనగామ వాసి మృతి

ట్రంప్ వీరాభిమాని, జనగామ జిల్లాకు చెందిన బుస్స కృష్ణ ఇవాళ ఉదయం గుండెపోటుతో చనిపోయారు. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణ ట్రంప్ అభిమానిగా ఫేమస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను దైవంగా కొలిచే కృష్ణ…ఇంటి బయట విగ్రహాన్ని కట్టించి అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కృష్ణ గురించి తెలుసుకున్న ట్రంప్….క్రిష్ తన ప్రాణ స్నేహితుడంటూ ట్వీట్ కూడా చేశాడు.