మోడీ గ్రేట్ జెంటిల్ మెన్: డొనాల్డ్ ట్రంప్

మోడీ గ్రేట్ జెంటిల్ మెన్: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇండియాతో తనకు ఉన్న అనుబంధం, ప్రేమను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి చూపించారు. ప్రధాని నరేంద్ర మోడీని ‘గ్రేట్ జెంటిల్ మెన్’ అని ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. జపాని ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహుతోపాటు ట్రంప్ తో మంచి ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ కలిగిన నేతల్లో మోడీ ఒకరు. ఈ ఇద్దరు నాయకులూ తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అగ్రరాజ్య అధ్యక్ష పదవి అలంకరించినప్పటి నుంచి అనేక సార్లు మోడీతోపాటు ఇండియాపై తనకు ఉన్న ప్రేమాభిమానాలను చూపిస్తూనే ఉన్న ట్రంప్ తాజాగా ఇంకోసారి మన దేశ ప్రధానిని పొగిడారు.

‘నేను మోడీని ఇష్టపడతా. నేను మీ ప్రధానిని చాలా ఇష్టపడతా. ఆయనో గ్రేట్ జెంటిల్ మెన్. ఆయన చాలా గొప్పగా పని చేస్తున్నారు’ అని ట్రంప్ మెచ్చుకున్నారు. మరో ప్రశ్నకు జవాబుగా ఇండియాలో తాను చాలా పాపులర్ అని ట్రంప్ చెప్పారు. ‘ఇండియాలో నేను చాలా పాపులర్ అని నాకు తెలుసు. అక్కడి ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఈ దేశం (అమెరికా)లో నన్ను మీడియా ఇష్టపడేదాని కంటే ఎక్కువగా ఇండియాలో ప్రజలు నన్ను లైక్ చేస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.