Donald Trump : ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ ఎత్తివేత

Donald Trump : ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై బ్యాన్ ఎత్తివేత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఉన్న బ్యాన్ ను మెటా ఎత్తివేసింది. వాటిన్నింటినీ పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. అసాధారణ పరిస్థితుల్లో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాల్సి వచ్చిందని కానీ ఇప్పుడు పరిస్థితి మారినందున వాటిని పునరుద్దరిస్తున్నట్లు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ చెప్పారు. వార్తలకు మాధ్యమంగా సోషల్ మీడియా మారుతున్నందున రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. 

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో మెటా ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేసింది. ట్విట్టర్ సైతం ట్రంప్ అకౌంట్ ను బ్యాన్ చేయగా.. ఇటీవలే దాన్ని పునరుద్దరించింది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్నారు.