- దంపతులను సన్మానించిన కలెక్టర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థంగా కృషిచేయడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కోసం 10 మంది లబ్ధిదారులకు ఉచితంగా ఎకరం భూమిని విరాళంగా అందజేసిన గ్రామానికి చెందిన దంపతులు ఆత్రం లేతుబాయి, జంగును కలెక్టర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సన్మానించారు.
ఇలాంటి స్వచ్ఛంద సహకారాలు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
