- జీవితంలో గెలుపోటములు సహజం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లో గల తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు.
ఈ అంశంపై కొందరు వ్యక్తులు స్మృతి ఇరానీపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. "జీవితంలో గెలుపోటములు జరుగుతాయి. స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, అవమానకరమైన పదాలను ఉపయోగించడం మానుకోవాలని నేను కోరుతున్నాను. ఒకరిని అవమానించడం బలహీనతకు సంకేతం, బలం కాదు" అని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా, రాహుల్ పోస్ట్‌పై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలను తోడేళ్ల గుంపులా పంపి.. ఇప్పుడు ఒక అసహ్యకరమైన సందేశాన్ని ఉంచారని ఆరోపించారు. స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీకి కమలా హారిస్ ఫోన్
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్లో మాట్లాడుకున్నారు. గురువారం వారిద్దరూ ఫోన్లో పలు విషయాలపై చర్చలు జరిపారు. ఏం మాట్లాడరనేదానిపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదు.