పిల్లలు ప్రశ్నలు అడిగితే చిరాకు పడొద్దు

పిల్లలు ప్రశ్నలు అడిగితే చిరాకు పడొద్దు
  • ఫోన్, టీవీ చూస్తున్నప్పుడు లేదా ఆన్​లైన్ గేమ్స్​ ఆడుతున్నప్పుడు ఏం చెప్పినా పిల్లలు వినిపించుకోరు. కారణం వాటి మీదే వాళ్ల దృష్టి ఉంటుంది. అందుకని టీవీ, ఫోన్ చూస్తున్నప్పుడు చెప్పొద్దు.  
  • కొందరు పేరెంట్స్ ‘ఇలా చేయొద్దు.  అలా ఉండాలి. ఇలా ఉండాలి’ అని ఒకేసారి చాలా విషయాలు చెప్తారు. అన్ని జాగ్రత్తలు ఒకేసారి చెప్తే ఏది గుర్తుపెట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్​లో పడతారు  పిల్లలు. దాంతో ఏదీ గుర్తుపెట్టుకోరు. అందుకని వాళ్లకు నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్పాలి. 
  • అంతేకాదు చెప్పిన విషయాన్ని తిరిగి పిల్లలతో చెప్పించాలి. దానివల్ల చెప్పిన విషయం పిల్లల మైండ్​లో  బాగా రిజిస్టర్​ అవుతుంది. 
  • చదువు లేదా ఏ విషయం గురించి అయినా  పిల్లలు ప్రశ్నలు అడిగితే చిరాకు పడొద్దు. వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పాలి. దాంతో తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్​ చేసుకుంటారు.
  • అంతేకాదు పేరెంట్స్ చెప్పేది శ్రద్ధగా వింటారు కూడా. 

చిన్నప్పటి నుంచే పిల్లలకు శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం అలవాటు చేయాలి. అది చిన్న జాగ్రత్తల నుంచి ఆహారపు అలవాట్ల వరకు ఏదైనా సరే.  లేదంటే ఒకే విషయాన్ని వాళ్లకు చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. దాంతో పిల్లలు మాట వినట్లేదని వాళ్లపై కోపంతో అరుస్తారు చాలామంది తల్లిదండ్రులు. అయితే వాళ్లు సరిగా వినకపోడానికి, అర్థం చేసుకోలేకపోవడానికి  కారణం తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్​లు​.