చరణ్ సింగ్​ను అవమానించొద్దు: రాజ్యసభ చైర్మన్

చరణ్ సింగ్​ను అవమానించొద్దు: రాజ్యసభ చైర్మన్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్​ను అవమానిస్తే సహించబోమని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖఢ్.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై మండిపడ్డారు. భారతరత్న అవార్డు పొందిన చరణ్ సింగ్ పై శనివారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఈ అంశంపై మాట్లాడేందుకు రాష్ట్రీయ లోక్​దళ్(ఆర్ఎల్డీ) చీఫ్, చరణ్ సింగ్ మనమడు జయంత్ చౌదరికి చైర్మన్ అవకాశం ఇచ్చారు. దీంతో చైర్మన్​ నిర్ణయంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నిబంధనల ప్రకారం జయంత్ చౌదరికి అవకాశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఖర్గేపై చైర్మన్ ధన్​ఖఢ్ తీవ్రంగా మండిపడ్డారు. చరణ్ సింగ్​ను అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు.