సింగరేణిని ప్రైవేటీకరించద్దు.. లోక్ సభలో పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ

సింగరేణిని ప్రైవేటీకరించద్దు.. లోక్ సభలో పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ

* సింగరేణిని ప్రైవేటీకరించొద్దు: లోక్ సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ
* కేంద్రానికి ఆ ఆలోచన లేదన్న కేంద్రం
* సంపూర్ణ మద్దతు ఉంటుందన్న గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ సింగరేణి ప్రైవేటీకరణ, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల కొనసాగింపు, ప్రభుత్వ రంగంలోనే ఉంచే అంశంపై ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. సింగరేణి ప్రైవేటు పరం చేయాలంటే అది 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ప్రధానమని చెప్పారు. సింగరేణి వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం  ఏర్పాటయ్యాక ఆ ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించినట్టు కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉందని తెలిపారు.