
అనర్హత వేటు పడిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి , భూపతిరెడ్డి లకు హైకోర్టు ఊరటనిచ్చింది. వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు ఈ నెల 15 వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయొద్దని కేంద్ర ఎన్నికలకమిషన్‌కు ఆదేశాలిచ్చిం ది. వాళ్లను అనర్హులుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను అందజేయాలని మండలి సెక్రటరీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ల డివిజన్ బెంచ్ గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ల అధికారాల అంశంపై న్యా య సమీక్ష చేస్తామని,రాజ్యాంగం పదో షెడ్యూల్ లోని 8వ పేరా రాజ్యాంగబద్ధతను తేలుస్తామని ప్రకటించింది. విచారణను15కు వాయిదా వేసింది. దేశంలోని ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు.
రాష్ట్రపతి అధికారాలనూ ప్రశ్నిస్తారా?
మండలి చైర్మన్ తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా అనర్హత వేటు వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలంటూ భూపతిరెడ్డి , యాదవరెడ్డిలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు విచారించింది. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ఆ8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని..స్పీకర్ , చైర్మన్ లు తమ అభీష్టం మేరకు నిర్ణయాలుతీసుకునేలా ఉందని భూపతిరెడ్డి తరఫు న్యా యవాది ఆనంద్ కపూర్ వాదించారు. ‘రాష్ట్రపతికీ ప్రత్యేకాధికారాలుంటా యి. వాటినీ ప్రశ్నిస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నిం చగా చట్టసభకు, కార్యనిర్వాహక వ్యవస్థకు తేడాలున్నా యని, రెండిం టినీ కలిపి చూడొద్దని లాయర్ బదులిచ్చారు. ఇందుకు సంబంధించి పలు సుప్రీం తీర్పుల్ ని ఉటంకించారు. ప్రజాస్వామ్య రక్షణకోసమే 10వ షెడ్యూల్ ను పార్లమెంటు అమల్లోకి తెచ్చిందని కేంద్రం తరఫు లాయర్ చెప్పారు.సభకెళ్తే ఫిరాయించినట్టా?‘యాదవరెడ్డి కాంగ్రెస్ లో చేరలేదు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. పార్టీలో చేరుతున్నట్లూ ప్రకటించలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఆమె పాల్గొన్నమేడ్చల్ సభకు వెళ్లారు. పత్రికలు, టీవీల్లో వచ్చినకథనాల ఆధారంగా యాదవరెడ్డిపై నాటి మండలిచైర్మన్ స్వామి గౌడ్ అనర్హత వేటు వేశారు. కనీసం ఆయన వాదననూ వినలేదు. ఏకపక్షంగా వ్యవహిం -చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం’ అని ఆయన తరఫులాయర్ ప్రకాష్‌రెడ్డి వాదించారు. సోనియాను కలిస్తే ఫిరాయింపెలా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘వారు పార్టీలో చేరారా, లేదా అనేదే ముఖ్యం . ఇక్కడ ఫిరాయిం పు చట్టం అమలు చేసేందుకున్న కారణాల్ని సమీక్షిస్తాం’ అని పేర్కొంది.