కోణార్క్ఎక్స్ప్రెస్లో స్పృహ కోల్పోయిన ప్రయాణికుడు

కోణార్క్ఎక్స్ప్రెస్లో  స్పృహ కోల్పోయిన ప్రయాణికుడు

మధిర, వెలుగు:   కోణార్క్​ ఎక్స్​​ప్రెస్​లో ఓ ప్రయాణికుడు స్పృహ కోల్పోగా మధిర రైల్వేస్టేషన్​లో ట్రైన్​ఆపి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం జరిగింది. 

మధిర రైల్వేహెడ్​ కానిస్టేబుల్​ వేణుగోపాల్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబాయి నుంచి భువనేశ్వర్​ వెళ్తుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్​   ట్రైన్​లో  సికింద్రాబాద్  నుంచి  విశాఖపట్నం కూలి పని కోసం వెళ్లేందుకు ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా పెద్దబయలు గ్రామానికి చెందిన  కీముడు జీవన్ కుమార్, కుర్ర లోకేశ్​కుమార్ ప్రయాణిస్తున్నారు. 

ట్రైన్​ మధిర సమీపానికి రాగానే జీవన్​ స్పృహ కోల్పోయాడు. వెంటనే ప్రయాణికులు మధిర రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మధిర  రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి,  సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని108అంబులెన్స్​ లో మధిర ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.  కాగా, వారు డబ్బులు లేక రెండు రోజుల నుంచి అన్నం తినలేదని, ఈ క్రమంలోనే జీవన్​ స్పృహ కోల్పోయాడని  తెలిసింది.