హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తే వరంగల్ అడ్డాగా నేరాలు.. రౌడీషీటర్ సురేందర్ అండ్ గ్యాంగ్ అరెస్ట్ !

హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తే వరంగల్ అడ్డాగా నేరాలు.. రౌడీషీటర్ సురేందర్ అండ్ గ్యాంగ్ అరెస్ట్ !

రౌడీ షీటర్ సురేందర్ ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ గ్యాంగ్ గా పేరుగాంచిన సురేందర్ అండ్ గ్యాంగ్ ను 2025 నవంబర్ 7 వ తేదీన వరంగల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నొటోరియస్ రౌడీ షీటర్ సరేందర్ లో పాటు అతని అనుచరులు 7 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 

సురేందర్ నుంచి రెండు రివాల్వర్లు, మూడు మ్యాగజైన్స్, ఒక బుల్లెట్, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ డ్రైవర్ ను గన్ తో బెదిరించిన కేసులో సూరి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

రౌడీ షీటర్ సూరిపై 46  క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ నుంచి సిటీ బహిష్కరణ వేటు వేయడంతో.. కొద్ది నెలలుగా వరంగల్ అడ్డాగా నేరాలకు పాల్పడుతోంది సూరి గ్యాంగ్.

బీహార్ నుంచి 50 వేల రూపాయలు చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన 2 తుపాకులు,బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భూపాలపల్లి లో ఇద్దరిని హత్య చేసేందుకు సూరి గ్యాంగ్ సుపారీ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.