
- కేంద్రాన్ని కోరిన తమిళనాడు సర్కార్
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫ్లైట్లు నడపడం మంచిది కాదని, ఫ్లైట్లను రీస్టార్ట్ చేయొద్దని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఈ నెల 31 వరకు ఫ్లైట్లను నడపొద్దని కోరుతూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కోరింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా అందుబాటులో లేదని చెప్పింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులను నిలిపేసింది. సోమవారం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించి విమానాల్లో తీసుకోవాల్సిన రూల్స్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా.. తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతన్న నేపథ్యంలో విమాన సర్వీసులను చెన్నైకు అనుమతిచొద్దని కోరారు.