జితేందర్ రెడ్డి పీఏపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న హైకోర్టు

జితేందర్ రెడ్డి పీఏపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న హైకోర్టు

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసులో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పెట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన 160 సి ఆర్ పిసి నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. పేట్ బషీర్ బాగ్ పోలీసులకు ఢిల్లీలో ఉన్న రాజును పిలిచి దర్యాప్తు చేసే అధికారం ఉందా..? అని హైకోర్టు ప్రశ్నించింది. శుక్రవారం వరకు పోలీసులు కోర్టుకు తెలపాలని హైకోర్టు అదేశించింది. అప్పటి వరకు రాజుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారం వరకు వాయిదా వేసింది.

 

ఇవి కూాడా చదవండి

మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి.. మొత్తం ఎంత వచ్చిందంటే