
న్యూఢిల్లీ: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెస్ట్ బెంగాల్ పర్యటన వివాదాస్పదంగా మారింది. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కొందరు రాళ్లతో దాడికి దిగారు. దాడికి పాల్పడ్డ వారు తృణమూల్ కాంగ్రెస్ నేతలే అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ కైలాశ్ విజయ్‌వర్గియా స్పందించారు. సీఎం మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు క్షమించబోరన్నారు. గూండాలకు పోలీసులు దన్నుగా నిలబడిన తీరు తమకు కొత్త అనిపించిందని, ఇది బెంగాల్ సంస్కృతి కాదన్నారు. పోలీసుల ముందే గూండాలు తమ కాన్వాయ్‌ల మీద రాళ్లు రువ్వారని పేర్కొన్నారు.