సెన్సేషన్ ​కోసం పాకులాడుతూ సెన్స్​లేని రాతలొద్దు

సెన్సేషన్ ​కోసం పాకులాడుతూ సెన్స్​లేని రాతలొద్దు
  •  జర్నలిస్టులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు

ఖైరతాబాద్, వెలుగు: నేటి జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని వదిలి సెన్సేషన్​కోసం తపిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్​పురస్కార గ్రహీత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రెడ్​హిల్స్ లో సీనియర్ ​జర్నలిస్టు అరుణ రవికుమార్​రచించిన ‘దేర్​ఐ వాజ్​’ అనే పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జర్నలిజంతో పాటు రాజకీయాల్లోనూ ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. సెన్సేషన్​కోసం పాకులాడుతూ సెన్స్​లేని రాతలు రాయొద్దని కోరారు. ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్​మాట్లాడుతూ.. తాను ఈ పుస్తకాన్ని చదివానని వివరించారు. అందరికీ నచ్చే విధంగా పుస్తకాన్ని రాశారని ప్రశంసించారు.