
డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ తన యాక్టింగ్ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న కరీనా కపూర్.. ఈసారి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జానే జాన్’. కహానీ, బద్లా లాంటి చిత్రాలతో మెప్పించిన సుజయ్ ఘోష్ దీనికి దర్శకుడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. విజయ్ వర్మ, జై దీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. తన భర్తను హత్య చేసి మాయం చేసే మాయా డిసౌజా అనే పాత్రలో కనిపిస్తోంది కరీనా కపూర్.
పక్కింట్లో ఏదో చప్పుడు అయిందని డోర్ కొట్టిన జైదీప్‌తో ఇంట్లోకి బొద్దింక వచ్చిందని అబద్ధం చెబుతుందామె. ఇంతకూ ఆ బొద్దింకను చంపేశారా అంటాడు జైదీప్. ఆమె భర్త మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ వర్మ కనిపించాడు. ఈ కేసులో కరీనాతో పాటు టీచర్ జైదీప్‌ను కూడా అనుమానిస్తూ ‘మీ హాట్ నైబర్ ఇప్పుడు నా హాట్ సస్పెక్ట్’ అంటాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే కథ ఇది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపేలా ఉంది. సెప్టెంబర్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది.