మంచానపడ్డోళ్లకు ఇంటి దగ్గరే టీకా

V6 Velugu Posted on Sep 24, 2021


న్యూఢిల్లీ: అనారోగ్యంతో మంచాన పడ్డోళ్లకు ఇంటి దగ్గరికే వచ్చి కరోనా వ్యాక్సిన్​ వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన, నడవలేని పరిస్థితిలో ఉన్న వారికి వ్యాక్సినేషన్​ విషయంలో అనుసరించాల్సిన గైడ్​లైన్స్​ను గురువారం విడుదల చేసింది. ఈమేరకు నీతి అయోగ్​ మెంబర్​ డాక్టర్​వీకే పాల్​ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యం వల్ల దగ్గర్లోని హెల్త్​ సెంటర్​కు కూడా వెళ్లలేని వారి వివరాలను సేకరించి, వారికి ఇంటి దగ్గరే కరోనా వ్యాక్సిన్​ వేసే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా సెకండ్​ వేవ్​ ఇంకా పోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న డైలీ కేసుల్లో 62.73% కేసులు ఒక్క కేరళలోనే రికార్డవుతున్నాయని వివరించారు. యాక్టివ్​ కేసుల్లో దాదాపు లక్షకు పైగా కేసులు అక్కడే ఉన్నాయని చెప్పారు. దేశంలోని 33 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేట్​ 10 శాతానికి పైన ఉందని, మరో 23 జిల్లాల్లో 5%  నుంచి 10% మధ్యలో నమోదవుతోందని తెలిపారు.
రాబోయే పండగల సీజన్​లో​.. అలర్ట్​గా ఉండాలె..
రాబోయే పండగల సీజన్​లో జనం పెద్ద సంఖ్యలో ఒక్కచోట గుమిగూడొద్దని కోరారు. ముఖ్యంగా కంటోన్మెంట్​ జోన్లలో, కరోనా వీక్లీ పాజిటివిటీ రేట్ 5 శాతానికంటే ఎక్కువున్న జిల్లాల్లో మాస్​ గ్యాదరింగ్స్​ను అడ్డుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. మరోవైపు, కరోనా బారినపడి కోలుకున్నంక ఎదురయ్యే అనారోగ్యాలకు అందించే ట్రీట్​మెంట్​పై కేంద్రం కొత్త గైడ్​లైన్స్ జారీ చేసింది. ఈమేరకు మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వివరాలను వెల్లడించారు. కరోనా వల్ల వచ్చే దీర్ఘకాలిక అనారోగ్యాలను డీల్​ చేయడంలో డాక్టర్లు, నర్సులు, కమ్యూనిటీ హెల్త్​ వర్కర్లకు ఈ గైడ్​లైన్స్ హెల్ప్​ చేస్తాయన్నారు. వైరస్​తో బాధపడుతున్న వారికి వీలైనంత తక్కువ సైడ్​ఎఫెక్ట్స్ తో నెగెటివ్​ ఎఫెక్ట్​ లేని ట్రీట్​మెంట్​ ఇవ్వాలని మాండవీయ చెప్పారు.

యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు తగ్గుతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దేశంలో కరోనా యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు తగ్గుతు న్నాయి. 187 రోజుల్లో యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు 3,01,640కి తగ్గాయని గురువారం హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తం గా కొత్తగా 31,923 కరోనా కేసులు నమో దయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కు చేరిందని ప్రకటించింది. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 282 మంది మరణించారని, మొత్తం మరణాల సంఖ్య 4,46,050కి చేరిందని తెలిపింది. బుధవారం మొత్తం 15,27,443 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 55.83 కోట్లకు చేరిందని పేర్కొంది. యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 97.77%కి పెరిగిందని వెల్లడిం చింది. డైలీ పాజిటివి టీ రేటు 2.09%, వీక్లీ పాజిటివిటీ 2.11%, డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు 1.33% ఉందని చెప్పింది. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.28 కోట్లకు పెరిగిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.39 కోట్ల డోసుల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశామని తెలిపింది.
 

Tagged Dr VK Paul, people, Door-to-Door, Covid-19 vaccination, restricte, mobility

Latest Videos

Subscribe Now

More News