
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సాయంత్రం వరకు 87,863 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇందులో 78,778 మంది పేమెంట్స్ చేసి, 70,005 మంది దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. వీరిలో 57,719 మంది కాలేజీల్లోని వివిధ కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. గురువారంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ముగియనున్నది. కాగా, ఈనెల 29న ఫస్ట్ ఫేజ్ సీట్లను అలాట్ మెంట్ చేయనున్నారు