జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూంల ఇండ్లు అప్పగించాలని ధర్నా

జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూంల ఇండ్లు అప్పగించాలని ధర్నా

 

  •  తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపిన లబ్ధిదారులు 

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి (కె)లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ మాట్లాడుతూ..  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు 20 రోజుల్లో అందిస్తామన్న అధికారులు  హామీ నిలబెట్టుకోలేదన్నారు.  

వెంటనే అధికారులు లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు లబ్ధిదారులకు అప్పగిస్తామని తహసీల్దార్ దశరథ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అధికారులు రెండోసారి ఇచ్చిన హామీని నిలబట్టుకోకపోతే ఏడో తేదీ తర్వాత తామే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్లి నివసిస్తామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు  పాల్గొన్నారు.