డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు కేటాయిస్తరు సారూ? : లబ్ధిదారులు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు కేటాయిస్తరు సారూ? : లబ్ధిదారులు

అద్దె ఇంట్లో ఉండలేకపోతున్నామని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెల అద్దె కోసం వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయాలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. దరఖాస్తులను తక్షణమే సర్వే చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తులను సర్వే చేయాలని లబ్ధిదారులు కోరారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని లబ్ధిదారులు మండిపడ్డారు.

లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెంటనే మంజూరు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్లా జిల్లా మున్సిపల్ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. డబుల్ బెడ్ రూమ్ ల కోసం దాఖలు చేసిన వారందరికీ వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మహిళలతో కలసి ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.