తలసాని, భట్టి మధ్య ‘డబుల్‘ వార్..నీళ్లు కాకపోతే నిప్పులొస్తాయా?

తలసాని, భట్టి మధ్య ‘డబుల్‘ వార్..నీళ్లు కాకపోతే నిప్పులొస్తాయా?

లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లపై  సీఎల్పీ నేత భట్టీ, మంత్రి తలసాని మధ్య మాటల వార్ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ బయట నిర్మిస్తున్న ఇండ్లు  చూసిస్తే ఒప్పుకోమని భట్టీ చెబుతుంటే… కళ్ల ముందు పని కనిపిస్తున్నపుడు ప్రతిపక్షాలు నిజాయతీగా ఒప్పుకోవాలన్నారు మంత్రి. కరోనాతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు.ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లే కాదు.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇల్లు కావన్నారు. ప్రభుత్వం పద్దతి ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తుందన్నారు. వర్షం పడితే నీళ్లు రాకుంటే… నిప్పు వస్తదా ? అని ప్రశ్నించారు. ఒకటి రెండు ఛానళ్లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయని..చూసే వాళ్లకు కూడా నిజాయితీ ఉండాలన్నారు.

రెండో రోజు డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లారు మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… ఇవాళ గ్రేటర్ పరిధిలో డబుల్ ఇండ్లను పరిశీలించనున్నారు. హైదరాబాద్ లోని మొత్తం తొమ్మిది ప్రాంతాలలోని నిర్మాణంలో ఉన్న ఇండ్లను చూడనున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూపించాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ బయట నిర్మిస్తున్న ఇండ్లను చూసిస్తే తాము ఒప్పుకోమన్నారు.