The Girlfriend BoxOffic Day 1: రష్మికాకు 'ది గర్ల్‌ఫ్రెండ్‌' ఫస్ట్ డే షాక్.. భూమాదేవికి జై కొట్టినా కనిపించని కలెక్షన్స్!

The Girlfriend BoxOffic Day 1: రష్మికాకు 'ది గర్ల్‌ఫ్రెండ్‌' ఫస్ట్ డే షాక్.. భూమాదేవికి జై కొట్టినా కనిపించని కలెక్షన్స్!

నేషనల్ క్రష్  రష్మికా మందన్నకు ఈఏడాది బాగా కలిసి వచ్చినట్లుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతోంది.  చావా, సికందర్, కుబేర, థామా  వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, ఆమె లేటెస్ట్ గా ధీక్షత్ శెట్టితో కలిసిన నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ మూవీ నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాటిటివ్ టాక్ అందుకుంటుంది. విమర్శకుల ప్రశంసలతో ఫుల్ ఖుషిగా ఉంది రష్మిక.

ఫస్ట్ డే కలెక్షన్స్.. 

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా మలిచిన ఈ చిత్రం, తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కాస్త నిదానంగా ప్రారంభించినా, ప్రేక్షకులను మాత్రం భావోద్వేగంతో కట్టిపడేసింది.  సినీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. తొలి రోజు  ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి కేవలం  రూ. 1.30 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. రష్మిక ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇదే అత్యల్ప ఓపెనింగ్‌ కావడం గమనార్హం.

తక్కువ కలెక్షన్లకు కారణాలు

తమ్మ లాంటి భారీ చిత్రం సెలవు దినాన విడుదలై తొలిరోజు  రూ.24 కోట్లు సాధించింది. కానీ, 'ది గర్ల్‌ఫ్రెండ్' మాత్రం ఎలాంటి సెలవు లేకుండా, కేవలం తక్కువ స్థాయి ప్రమోషన్స్‌తో విడుదలవ్వడం వసూళ్లపై ప్రభావం చూపిందంటున్నారు సినీ వర్గాలు. తెలుగులో 838 స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు 16.90 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసింది. బెంగళూరు 9 శాతం ఆక్యుపెన్సీ, హైదరాబాద్ 26 శాతం ఆక్యుపెన్సీ తో  షోలు ప్రారంభమయ్యాయి. హిందీ మార్కెట్‌లో కేవలం 99 స్క్రీన్‌లకు పరిమితమై, 6.89 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసింది.

 'కెరీర్-బెస్ట్' పెర్ఫార్మెన్స్

తొలిరోజు వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, సినిమాకు బలమైన పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా రష్మిక నటనకు విమర్శకులు పట్టం కడుతున్నారు. ఆమె కెరీర్‌లో ఇదే ఉత్తమ ప్రదర్శన అని కితాబిస్తున్నారు. ఈ భూమాదేవి ( రష్మిక ) ప్రేమలో మోసపోయి, తండ్రి ముందు పరువుపోయి.. ఇలా తెలిసి తెలియక మోసిన బరువుని.. అంతులేని బాధతో ఎలా ముందుకు వెళ్ళింది? టాక్సిక్ రిలేషన్లో చిక్కుకున్న భూమా దేవీ చివరికి ఎలాంటి ఆలోచనలతో బయటపడింది? అనేది ది  కథ. 'ఈ కథ ప్రతి అమ్మాయిది. ఇంట్లో, బయట అణచివేతకు గురైన, నోరు మెదపలేని స్త్రీల గళం ఇది. ఆధునిక సంబంధాలు, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, విద్య, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో రాహుల్ రవీంద్రన్ చెప్పిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు. ఈ చిత్రం నేటి యువత, ముఖ్యంగా మహిళలు స్వీయ-నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను బలంగా నొక్కి చెబుతుందని ప్రశంసలు అందుకుంటింది.

ఈ మూవీలో ధీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి వంటి అగ్ర తారాగణం ఈ చిత్రానికి బలం. బలమైన 'మౌత్ టాక్' తో వారాంతంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో  గీతా ఆర్ట్స్ సంస్థ సమర్పణలో ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు . బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, 'ది గర్ల్‌ఫ్రెండ్‌' మాత్రం రష్మిక మందన్న నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఖాయం అంటున్నారు .