కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రెండు పొరల ఫ్యాబ్రిక్ క్లాత్ తో తయారు చేసిన మాస్క్ కాపాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం సిఫార్స్ చేసింది.
ఈ నేపథ్యంలో ఫ్యాబ్రిక్ క్లాత్ తో ఇంట్లో తయారు చేసిన మాస్క్ ను ధరించడం వల్ల ఎంత వరకు సురక్షితంగా ఉండవచ్చు అనే అంశంపై ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు పరిశోధనలు జరిపారు.
ఈ పరిశోధనల్లో కరోనా సోకిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దగ్గు లేదా తుమ్మే సమయంలో నోటి నుంచి వెలువడే నీటి తుంపర్ల ప్రభావాన్ని తగ్గించేందుకు సింగిల్ లేదా డబుల్ లేయర్ క్లాత్ తయారు చేసిన మాస్క్ ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు.
సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ సైంటిస్ట్ రైనా మాక్ ఇన్టైర్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల గురించి థోరాక్స్ మీడియా సంస్థ పలు కథనాల్ని ప్రచురించింది.
డాక్టర్ల సర్జికల్ మాస్క్ లు తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తిని నిలువరిస్తున్నట్లు మూడు చిత్రాల ద్వారా సైంటిస్ట్ లు గుర్తించినట్లు థోరాక్స్ తన కథనంలో పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రధాన రచయిత యుఎన్‌ఎస్‌డబ్ల్యులోని స్కూల్ ఆఫ్ మెకానికల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రతీక్ బాహ్ల్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు కనీసం రెండు పొరలతో తయారు చేసిన మాస్కుల్ని ధరించడం ఉత్తమమని అన్నారు.
మూడు లేయర్ల సర్జికల్ ఫేస్ మాస్క్ నోటి నుంచి వెలువడే తుంపర్ల వ్యాప్తిని తగ్గిస్తుందని, సింగిల్ లేయర్ మస్క్ మాట్లాడే సమయంలో, డబుల్ లేయర్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లని అడ్డుకుంటున్నట్లు ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు నిర్ధారించారు.
