ఇంగ్లీష్​ మీడియంపై అంత మోజు ఎందుకు : డీపీ సక్లానీ

ఇంగ్లీష్​ మీడియంపై అంత మోజు ఎందుకు : డీపీ సక్లానీ

న్యూఢిల్లీ: ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై తల్లి దండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్ డీపీ సక్లానీ అన్నారు . ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలి పారు. మంగళవారం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్​ ఇండియా ఎడిటర్లతో ఆయన మాట్లాడారు. ‘‘ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై తల్లిదండ్రులకు మోజు పెరిగింది.

 ఆ స్కూల్స్​లో టీచర్లు లేకపోయి నా, వారికి సరైన ట్రైనింగ్ లేకపోయినా అక్కడికే పంపడానికి ఇష్టపడుతున్నారు. ఈ విధంగా చేయడం సూసైడ్ కంటే తక్కువేమీ కాదు. అందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మాతృభాషలో బోధించడాన్ని నొక్కి చెప్పింది. మన మూలాలను అర్థం చేసుకోవాలంటే మాతృభాషలో బోధన జరగాలి. అప్పటివరకు మనం వేరే వాటిని అర్థం చేసుకోలేం. ప్రస్తుతం మేం 121 భాషల్లో పుస్తకాలను రెడీ చేస్తున్నాం. ఈ ఏడాది అవి సిద్ధం అవుతాయి. స్కూల్​కు వెళ్లే పిల్లలు మూలాలు తెలుసుకోవడానికి ఇవి సహాయపడతాయి. భాష అనేది నాలెడ్జ్ సంపాదించేందుకు ఉపయోగపడాలి కానీ, కోల్పోయేలా ఉండకూడదు” అని అన్నారు.