
న్యూఢిల్లీ: తెలంగాణను భారతదేశ సెమీకండక్టర్ల ఇండస్ట్రీలో టాప్‌గా నిలపడానికి, టీ-–చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్) చైర్మన్ ఎండీ అండ్ సీఈఓ సుందీప్ కుమార్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ఐటీ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్‌బాబుకు అందజేశారు. టీ–-చిప్ బృందం తైవాన్ హాంకాంగ్‌లలో పర్యటించి, ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ కంపెనీలు టీఎస్ఎంసీ, ఏఆర్ఎం, సైనాప్సిస్, ఫారడే టెక్నాలజీ, పీయూఎఫ్ సెక్యూరిటీ, గస్ టెక్నాలజీ, లిట్మ్యాక్స్, సూపర్‌మైక్రో, నేషనల్ యాంగ్ మింగ్ చియావో తుంగ్ యూనివర్సిటీ (ఎన్వైసీయూ), తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎస్ఆర్ఐ), టీఏఐఆర్ఓఎస్ (తైవాన్ ఆటోమేషన్ ఇంటెలిజెన్స్ రోబోట్ షో) నుంచి సేకరించిన సమాచారంతో డీపీఆర్ రూపొందించారు.
ఇది అధునాతన చిప్ డిజైన్, తయారీ నమూనాలు అత్యాధునిక అప్లికేషన్ల గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. తెలంగాణను సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చేందుకు ప్రొఫెసర్లకు, స్టూడెంట్లకు సెమీకండక్టర్ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని టీ–చిప్ సిఫార్సు చేసింది.