
మన తెలుగు వారు సినిమాలకే ఫ్యాన్స్ కాకుండా సీరియల్స్ కి కూడా ఫ్యాన్సే. మరీ ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో ప్రతి ఇంటికి బాగా చేరువైంది. డాక్టర్ బాబు(Doctor Babu), వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా లేడీ ఫాన్స్ అయితే.. ఈ సీరియల్ ని బాగా ఓన్ చేసుకున్నారు. అలా గత కొన్ని సంవత్సరాలుగా అలరించిన ఈ సీరియల్ కు గతేడాది ఫిబ్రవరిలో ఎండ్ కార్డ్ పడింది.
ఇక తాజాగా కార్తీకదీపం డాక్టర్ బాబుగా చేసిన నిరూపమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2' సీరియల్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. "ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార‍్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది" అని చెప్పుకొచ్చాడు నీరూపమ్
ఇక ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని చెప్పుకొచ్చాడు నిరూపమ్.