- 185 మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకున్న ఎంఎన్ సీ కంపెనీలు
ముషీరాబాద్,వెలుగు : విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా ప్లేస్ మెంట్ కూడా కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ కల్పించింది. శుక్రవారం కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎంఎన్ సీ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. టెక్ మహీంద్రా, క్యు కనెక్ట్, ఎస్ బీఐ, యాక్సిస్ బ్యాంక్, లెన్స్ కార్ట్, జస్ట్ డయల్ కంపెనీ ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఇంటర్వ్యూలు చేశారు.
ప్రతిభ ఆధారంగా సుమారు 185 మంది విద్యార్థులు వివిధ కంపెనీలు రిక్రూట్ చేసుకుని నియామక పత్రాలు అందించాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్లేస్ మెంట్ కల్పించి వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల మేనేజ్ మెంట్ పేర్కొంది. విద్యతోపాటు ప్లేస్ మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. మేనేజ్ మెంట్ విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు, ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్, ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
