రక్తదానం ఇతరులకు ప్రాణ వాయువు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్

రక్తదానం ఇతరులకు ప్రాణ వాయువు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్

ట్యాంక్ బండ్, వెలుగు: రక్తదానం ఇతరులకు ప్రాణ వాయువుగా నిలుస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అటానమస్) కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్ అన్నారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయగా, సరోజా వివేక్, లింగ ప్రకాశ్, బ్రహ్మకుమారిస్ ఇన్​చార్జీ జయశ్రీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రక్తదానంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

లింగ ప్రకాశ్, జయశ్రీ మాట్లాడుతూ.. సేకరించిన రక్తాన్ని తలసేమియా రోగులకు ఉపయోగిస్తామన్నారు.  కాలేజీ ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ తో సహా వివిధ కోర్సులకు చెందిన 200 మంది విద్యార్థులు రక్త దానం చేయగా, ప్రశంసా పత్రాలను అందజేశారు. కాలేజీ జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్, సీఈవో ప్రో. లింబద్రి పాల్గొన్నారు.