
- రాష్ట్ర స్థాయి ర్యాంకులుసాధించిన స్టూడెంట్లు
- సంతోషం వ్యక్తం చేసిన కళాశాల కరస్పాండెంట్ సరోజా వివేక్
ముషీరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న బండారి లక్ష్మీదీప ఎంపీసీలో 467/470, జబ కేదార్నాథ్ ఎంపీసీలో 465/470, ఉన్నిసా బేగం ఎంపీసీలో 463/470, బైకని నందు ఎంపీసీలో 463/470, పూజా శర్మ ఎంఈసీలో 489/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నిలిచారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ సరోజ వివేక్ మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు విద్య అందించడం కాకా వెంకటస్వామి లక్ష్యమని, దానిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తమ విద్యాసంస్థల నుంచి ఉత్తీర్ణులైన పేద విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించడం సంతోషకరమన్నారు. మెరుగైన విద్య అందించడం కోసం మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. కాకా విద్యాసంస్థలను రాష్ట్రస్థాయిలో నిలబెడుతున్న విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.