మదర్ థెరిస్సా 1910 ఆగస్టు 26న యుగోస్లేవియా ప్రస్తుతం మాసిదోనియా దేశంలోని స్కోప్ జీ అనే గ్రామంలో ఆల్బెనియా జాతి కుటుంబంలో డ్రాన్ బోజా క్షువ, నికోలస్ పుణ్య దంపతులకు జన్మించారు. తన 10వ ఏట ఆమె తండ్రి నికోలస్ మరణించారు. 12వ ఏట క్రైస్తవ మతానికి ఆమె ఆకర్షితురాలు అయింది. అనంతరం తన 18వ ఏట సేవా కార్యక్రమాల కోసం ఇల్లు విడిచి బయలుదేరి తిరిగి మళ్లీ ఇల్లు ముఖం చూడలేదు.
1929లో హిమాలయ పర్వత ప్రాంతం డార్జిలింగ్‌కు వచ్చి తన సామాజిక సేవను ప్రారంభించారు. కలకత్తాలో కరువు ఏర్పడినప్పుడు దాతల ద్వారా విరాళాలు సేకరించి ప్రజలను కాపాడారు. 1952లో కలకత్తా నగరపాలక సంస్థ తన సేవ కోసం ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో నిర్మల హృదయ్ ఆశ్రయం ఏర్పాటు చేశారు. కుష్టువ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రయం ఏర్పాటుచేశారు. 1965 వ సంవత్సరంలో వెనిజువెలా దేశంలో 5 మంది సేవకుల సమక్షంలో సేవా సదనం ఏర్పాటు చేశారు.
1962లో రామన్ మెగాసేసే అవార్డు పొందారు.1980లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న పొందారు . 1997 సెప్టెంబర్ 5న 87వ ఏట మరణించేవరకు మదర్ థెరిసా మానవతా మూర్తిగా సేవ చేశారు. అప్పట్లో భయంకరమైన రోగాలైన ఎయిడ్స్. కుష్టు వ్యాధి. క్షయ, కలరా వంటి రోగాలకు వైద్యం చేసే మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా స్థాపించారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పిద్దాం.
- డా. ఈదునూరి వెంకటేశ్వర్లు
